News July 20, 2024
అంగన్వాడీల శిక్షణ పూర్తవుతున్న నగదు జమ కాలేదు

అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య బోధించాలని నిర్ణయించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 1,849 అంగన్వాడీ కేంద్రాల్లోని 1,835 మంది టీచర్లను 49 బృందాలుగా విభజించి ఇస్తున్న శిక్షణ నేటితో ముగుస్తుంది. రోజుకు 2 సార్లు టీ, స్నాక్స్, భోజనానికి రూ.120 కేటాయిస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. కానీ శిక్షణ పూర్తవుతున్నా నగదు అందకపోవడంతో అంగన్వాడీలు నిరాశ చెందుతున్నారు.
Similar News
News December 1, 2025
కామేపల్లిలో రెండో రోజు 169 నామినేషన్లు దాఖలు

కామేపల్లి మండలంలో రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 39, వార్డు స్థానాలకు 130 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో జి. రవీందర్ తెలిపారు. దీంతో ఇప్పటివరకు మండలంలో సర్పంచ్ స్థానాలకు మొత్తం 49, వార్డు స్థానాలకు 142 దరఖాస్తులు దాఖలైనట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా సాగుతున్నట్లు, లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
News December 1, 2025
పేదలకు వరం.. ఖమ్మం జీజీహెచ్లో పేస్మేకర్ సర్జరీ

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పేద ప్రజలకు భారీ ఖర్చుతో కూడిన పేస్మేకర్ సర్జరీ ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. గుండె కొట్టుకునే వేగం తగ్గిన తిరుమలాయపాలెంకు చెందిన 67ఏళ్ల దామెర వెంకన్నకు డాక్టర్ సీతారాం, డాక్టర్ జియా నేతృత్వంలోని వైద్య బృందం నవంబర్ 30న శాశ్వత పేస్మేకర్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ ఈ వైద్య బృందాన్ని అభినందించారు.
News December 1, 2025
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్రీజ

ఫేజ్-2 మండలాల స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్రీజ ఈరోజు పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలలో అన్ని విధానాలు జాగ్రత్తగా అమలవుతున్నాయని ఆమె నిర్ధారించుకున్నారు. అనంతరం డీపీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి, రోజువారీ రిపోర్టింగ్ ప్రక్రియలను ధృవీకరించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.


