News March 4, 2025

అంగన్వాడీల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం

image

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణికి అంగన్వాడీలు వినతి పత్రాన్ని మంగళవారం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 42 గంటల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. 10వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News November 23, 2025

ప.గో: బొలెరో ఢీకొని యువకుడి మృతి

image

నరసాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో మొగల్తూరుకు చెందిన మన్నే ఫణీంద్ర (21) దుర్మరణం పాలయ్యారు. శనివారం పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి సోదరుడు వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.

News November 23, 2025

ప.గో: వందేళ్ల వేడుకకు వేళాయె..!

image

ప.గో జిల్లాలో ఈ నెల 23న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో ఆమె సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

News November 23, 2025

ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి: జేసీ

image

అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లే అవుట్‌లో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. రెండు రోజులుగా అప్డేట్ చేయాల్సిన యాప్‌ను ఇప్పటికే జిల్లాలోనీ పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాలలో డేటా ఎంట్రీని మొదలుపెట్టడం జరిగిందన్నారు.