News March 5, 2025
అంగన్వాడీ కేంద్రాలకు నిధుల మంజూరు

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూ.3.08 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అంగన్వాడీలలో సీమంతం, అన్నప్రాశన, తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు. అనంత జిల్లాలో 2,303 కేంద్రాలకు రూ.1.38 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,824 కేంద్రాలకు రూ.1.70 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 23, 2026
కృష్ణా: అపరాల కోతలకు కూలీల కొరత

జిల్లాలో రెండో పంటగా సాగుచేసిన అపరాల పంట కోతల దశకు చేరుకోవడంతో రైతులకు కూలీల కొరత తీవ్రంగా ఎదురవుతోంది. స్థానికంగా వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో జిల్లాకు తరలివస్తున్నారు. ప్రస్తుతం అపరాల పంట కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కూలీలకు డిమాండ్ ఏర్పడింది.
News February 23, 2026
RRR కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ నాయక్ అరెస్ట్

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్పటి డీఐజీ సునీల్ నాయక్‌ను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌లో అదుపులోకి తీసుకొని ఏపీకి తరలిస్తున్నారు. కాగా ఇదే కేసులో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
News February 23, 2026
మక్తల్: కబడ్డీ ఆడిన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌కు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఆయన క్రీడాకారులతో సరదాగా కబడ్డీ ఆడి అలరించారు. పురుషుల రంగారెడ్డి-గద్వాల్ , మహిళల రంగారెడ్డి-ఆదిలాబాద్ జట్ల మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌ను మంత్రి తిలకించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయా జట్ల వద్దకు వెళ్లి వారిని పరిచయం చేసుకున్నారు.


