News March 5, 2025

అంగన్వాడీ కేంద్రాలకు నిధుల మంజూరు

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూ.3.08 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అంగన్వాడీలలో సీమంతం, అన్నప్రాశన, తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు. అనంత జిల్లాలో 2,303 కేంద్రాలకు రూ.1.38 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,824 కేంద్రాలకు రూ.1.70 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 26, 2025

పాలమూరు: ‘మరమ్మతులు చేసి సాగునీరు అందించండి’

image

గద్వాల జిల్లాలోని తెల్లరాళ్లపల్లి తండా సమీపంలో కేఎల్ఐడీ 8 కాల్వ గండి పడింది. దీంతో సాగునీరు వృథాగా పోతోందని రైతులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేసి సాగునీరు అందించి పంటలను కాపాడాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేఎస్ఐ అధికారులను కోరితే తమ పరిధి కాదంటూ NGKL జిల్లా అధికారులు తమ పరిధి కాదంటూ WNP జిల్లా అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారని వాపోయారు.

News March 26, 2025

MDK: హామీలను అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదు: హరీశ్ రావు

image

కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం మెదక్‌లో మాట్లాడుతూ.. రుణమాఫీ చేసిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని, రుణమాఫీ కాని రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు.

News March 26, 2025

కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

image

AP: మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల సమయంలో గుండెలోనూ సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
(Article being continuously updated..)

error: Content is protected !!