News February 6, 2025
అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలి: KMR కలెక్టర్

సీడీపీఓలు, సూపర్‌వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లో అంగన్వాడీ భవన నిర్మాణాలు తదితర అంశాలపై కలెక్టర్ బుధవారం సమీక్షించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులను జిల్లా సంక్షేమ అధికారిని పరిశీలించాలని సూచించారు. వేసవిలోగా అంగన్వాడీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలన్నారు.
Similar News
News March 17, 2026
సినిమా పైరసీ చేస్తే మూడేళ్ల జైలు!

TG: రాష్ట్రంలో సినిమా పైరసీని కట్టడి చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు చేపడుతోంది. మూవీ పైరసీ చేస్తూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. రూ.3 లక్షల వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ తప్పదని CSB డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి సంయుక్తంగా యాంటీ పైరసీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News March 17, 2026
MDK: 428 అంగన్వాడీలకు మహార్దశ

అంగన్వాడీలకు మహర్దశ రానుంది. అసౌకర్యాలకు నిలయంగా మారిన అంగన్వాడీలు బలోపేతం కానున్నాయి. తెలంగాణలో 5008 అంగన్‌వాడీలను ‘సక్షం’లో భాగంగా ఆధునికీకరించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా మెదక్‌లో 130, సంగారెడ్డిలో 298 అంగన్వాడీలు సక్షం సెంటర్లుగా ఎంపికయ్యాయి. ఎంపికైన కేంద్రాల్లో మెరుగైన వసతుల కల్పనతో పాటు డిజిటల్ విద్యా బోధన, LED స్క్రీన్ల ఏర్పాటు, పోషకాహారం అందనుంది.
News March 17, 2026
పెరగనున్న కార్ల ధరలు!

కార్ల కంపెనీలు మరోసారి షాక్ ఇవ్వనున్నాయి. తమ వెహికల్స్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. రూపాయి పతనం, రా మెటీరియల్ ఖర్చులు ఎక్కువ కావడంతో ఇప్పటికే జనవరిలో ఓసారి పెంచాయి. తాజాగా వచ్చే నెలలో మెర్సిడెస్ బెంజ్, ఆడి 2 శాతం చొప్పున, టాటా సంస్థ 1.5 శాతం పెంచనున్నాయి. హ్యుందాయ్, మారుతీ సుజుకీ సహా మిగతా ప్రధాన సంస్థలు కూడా ధరలు సవరించాలని భావిస్తున్నాయి.


