News April 4, 2024

అంగన్వాడీ కేంద్రాల సమయాలలో మార్పు: ఢిల్లీ రావు

image

వేసవి దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సమయాలను మారుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 4వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. తాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డిహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు.

Similar News

News January 12, 2025

పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తూ పెంచాలి: మంత్రి అనిత

image

మంత్రి అనిత శనివారం విజయవాడలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తూ పెంచాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండేందుకు తర్వాతి తరంలో సామాజిక స్పృహ నింపాల్సిన బాధ్యత ప్రతి తల్లిపై ఉందన్నారు. బాలలకు క్రమశిక్షణ నేర్పేలా మొదటి పోలీసింగ్ తల్లి దగ్గరే మొదలవ్వాలన్నారు.

News January 12, 2025

విజయవాడ: ‘అప్పట్లో అరాచకాలు, ఇప్పుడు నీతులా?’

image

వైసీపీ ప్రభుత్వంలోనే ఇష్టానుసారంగా సంక్రాంతి సంబరాల పేరుతో క్యాసినోలు నిర్వహించిన ఘనత ఆ పార్టీ నేతలకే దక్కిందని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చింతల అనిల్ కుమార్ విమర్శించారు. శనివారం విజయవాడలో తన కార్యాలయంలో అనిల్ వైసీపీపై మండిపడ్డారు. ఆరు నెలల కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో ఆ పార్టీ నేతలు అరాచకాలు సృష్టించి, నేడు నీతులు వల్లించడం దారుణం అన్నారు.

News January 11, 2025

కృష్ణా: ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మందికి లబ్ధి

image

ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల కింద రూ.788 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. కాగా ఎన్టీఆర్ జిల్లాలో 605, కృష్ణాలో 508 సచివాలయాల పరిధిలో వేలాదిమందికి ఈ పథకం కింద లబ్ధి అందనుంది. గత ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలలో పీజీ చదివిన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిలిపివేయగా కూటమి ప్రభుత్వం పథకం అమలు చేస్తూ నిధులు విడుదల చేసింది.