News February 5, 2025

అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పార్థసారథి వినతి

image

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మంగళవారం కలిసి రైల్వే గేట్ నంబర్ 197 వద్ద రోడ్డు, అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణంపై విన్నవించారు. పట్టణంలో ఈ గేటు మూసివేయడంతో మార్కెట్ యార్డ్‌కు వెళ్లాల్సిన రైతులు, కార్మికులు, పాదచారులు అదనంగా 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కోరారు.

Similar News

News February 17, 2025

కర్నూల్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత

image

కర్నూలులో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలలో ఇంత ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

News February 17, 2025

కర్నూలు: మద్యం మత్తులో తండ్రిని చంపాడు

image

మద్యం మత్తులో తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో ఆదివారం జరిగింది. నన్నూరుకు చెందిన నారాయణ, అతడి పెద్దకొడుకు నవీన్ ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత మద్యం మత్తులో గొడవకు దిగారు. మాటామాటా పెరిగడంతో నవీన్ కోపంతో కర్రతో నారాయణ తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.

News February 16, 2025

తుగ్గలి: ఒకటే చెట్టు.. రెండు విభిన్నతలు

image

తుగ్గలి మండలం రాతన ఆశ్రమ పాఠశాల సమీపంలోని ఓ చింత చెట్టు చూపరులను ఆకర్షిస్తోంది. చెట్టు ఓ వైపు ఆకులు ఎండిపోయి కనిపిస్తుంటే, మరో వైపు పచ్చని ఆకులతో కళకళలాడుతోంది. రెండు వర్ణాలతో దర్శనమిస్తున్న చెట్టు ఆ మార్గం గుండా వెళ్లే చూపరులను, వాహనదారులను, రైతులను ఆకట్టుకుంటోంది.

error: Content is protected !!