News October 1, 2024
అండర్-17 రాష్ట్రస్థాయి పోటీలు: ఖోఖోలో విజేతగా విశాఖ జట్టు
వినుకొండ లయోలా హైస్కూల్లో జరుగుతున్న అండర్-17 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. ఖోఖోలో విశాఖ జట్టు విజేతగా నిలవగా, రన్నరప్ స్థానాన్ని అనంతపురం దక్కించుకుంది. ఫుట్‌బాల్‌లో వైఎస్‌ఆర్ కడప విజయం సాధించగా.. చిత్తూరు జట్టు రెండో స్థానంలో నిలిచింది. బాల్‌బ్యాడ్మింటన్‌లో గుంటూరు జిల్లా జట్టు గెలుపొందింది. విజేతలకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బహుమతులను ప్రదానం చేశారు.
Similar News
News October 14, 2024
విశాఖ జిల్లాలో 31 మంది మహిళలకు మద్యం షాపుల లైసెన్స్
విశాఖ జిల్లాలో 31 మంది మహిళల పేరున మద్యం దుకాణాలకు లైసెన్స్ లభించింది. మొత్తం జిల్లాలో 155 మద్యం షాపులకు గాను అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకోసం సుమారు 4000 దరఖాస్తులు అందాయి. సోమవారం షాపుల కేటాయింపు లాటరీ ప్రక్రియ ద్వారా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 31 మంది మహిళల పేరున మద్యం లైసెన్సులు మంజూరయ్యాయి.
News October 14, 2024
విశాఖ: కాఫీ కొనుగోలు ధరలను ప్రకటించిన జీసీసీ
గిరిజన సహకార సంస్థ 2024-25 సీజన్ కు గిరిజన రైతుల నుంచి సేకరిస్తున్న కాఫీ గింజలకు కొనుగోలు ధరలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జీసీసీ వైస్ ఛైర్మన్ ఎండీ కల్పనా కుమారి అధ్యక్షతన అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అరెబికా పార్చ్ మెంట్‌కు కిలో రూ.285, అరెబికా చెర్రీ రకానికి రూ.150, రోబస్టా చెర్రీ రకానికి రూ.80 చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిపారు.
News October 14, 2024
16న విశాఖలో జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
విశాఖ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఏడు వరకు గల స్థాయిూ సంఘ సమావేశాలు వేరువేరుగా ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరుగుతాయన్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశానికి హాజరు కావాలని కోరారు.