News November 8, 2024
అండర్-19లో మెరిసిన HYD ప్లేయర్
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో గోవా జట్టుతో జరుగుతున్న కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఇవాళ్టి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ 136 ఓవర్లలో 604 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన ఆరన్ 258 బంతుల్లో 219 రన్స్ చేసి వావ్ అనిపించారు.
Similar News
News December 5, 2024
HYD: పాన్ కార్డు కరెక్షన్స్.. ఇది మీ కోసమే!
HYD అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ భవనంలో CSC హెడ్ ఆఫీసులో పాన్ కార్డు, పాస్ పోర్టు సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాన్ కార్డులో పేరు, DOB మార్పులు చేర్పులు కూడా చేస్తామన్నారు. మిగతా సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
SHARE IT
News December 4, 2024
HYD: తార్నాక IICTలో ఉద్యోగాలు
55% మార్కులతో 10TH, ఇంటర్, ITI చేసిన అభ్యర్థులకు శుభవార్త. HYD తార్నాకలోని CSIR-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) టెక్నీషియన్ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. SC, ST, మహిళా అభ్యర్థులు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2024.
SHARE IT
News December 4, 2024
HYDలో పెరిగిన కోడిగుడ్ల ధరలు
రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్లో ధర రూ.5.90గా NECC నిర్ణయించింది. దీంతో HYDలోని పలు ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్ముతున్నారు. 4నెలల క్రితంతో పోల్చితే రూ.3 వరకు పెరిగాయి. చలికాలంలో గుడ్ల వినియోగం పెరగడంతో, క్రిస్మస్, న్యూ ఇయర్‌కు కేకులు తయారీలో వాడుతుండటంతో రేట్లు పెరిగినట్లు అమ్మకదారులు తెలిపారు. ధరలు మరింత పెరగుతాయని అంచనా.