News March 8, 2025
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ఏకైక ఏపీ మహిళ

తెనాలికి చెందిన బండ్ల శిరీష ఏపీ నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ఏకైక మహిళ. మురళీధర్, అనురాధ దంపతులకు 1987లో శిరీష జన్మించారు. 5 ఏళ్ల వయసులోనే అమెరికాకు వెళ్లి హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. 2021లో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన అంతరిక్ష ప్రయాణంలో ఆమె పాల్గొన్నారు. దీంతో కల్పనా చావ్లా తర్వాత భారత్లో పుట్టి స్పేస్లో అడుగుపెట్టిన రెండో మహిళగానూ, ఏపీ నుంచి ఏకైక మహిళగా నిలిచారు.
Similar News
News March 23, 2025
అధికారులకు గుంటూరు కలెక్టర్ సూచనలు

తుళ్లూరు మండలం వెలగపూడి రాష్ట్ర సచివాలయం సమీపంలో మార్చి 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది ఉత్సవాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేదిక ఏర్పాట్లను శనివారం సాయంత్రం సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
News March 22, 2025
జగన్ అభిప్రాయం అదిములపు సురేష్ ద్వారా చెప్పించారా?: మందకృష్ణ మాదిగ

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సామాజిక న్యాయంగా చూస్తున్నారా, దళితుల మధ్య చిచ్చుగా చూస్తున్నారా అనేది వైసీపీ అధినేత జగన్ స్పష్టత ఇవ్వాలని మందకృష్ణ మాదిగ అన్నారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ గురించి జగన్ సమర్థిస్తున్నారా, లేక వ్యతిరేకిస్తున్నారా? జగన్ అభిప్రాయం అదిమూలపు సురేష్ ద్వారా చెప్పించారా? అనేది జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని మందకృష్ణ కోరారు.
News March 22, 2025
గుంటూరు జిల్లాలో ఉగాది పురస్కారాలు వీరికే..

గుంటూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన పలువురికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందజేయనుంది. వారిలో తాడేపల్లి సీఐడీ అడిషనల్ ఎస్పీ జయరామరాజు మహోన్నత సేవా పతకం అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ సేవా పురస్కారానికి హెడ్ కానిస్టేబుల్ పిచ్చయ్య, APSP 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ హనుమంతు, ARSI ఉదయ కుమార్, PCలు శివప్రసాద్, విరుపాక్ష ఎంపికయ్యారు. తెనాలి ఎస్ఐ శ్రీనివాసరావుకు సేవా పురస్కారం వరించింది.