News August 13, 2024

అంతరిక్ష వేడుకలను ప్రారంభించిన పవన్

image

శ్రీహరికోటలోని ఎంఆర్ కురుప్ ఆడిటోరియంలో జాతీయ అంతరిక్ష వేడుకలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా హెలికాప్టర్లో షార్‌కు చేరుకున్న ఆయనకు అధికారులు, షార్ శాస్త్రవేత్తలు స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

Similar News

News July 7, 2025

నెల్లూరులో సోమవారం మంత్రి లోకేశ్ పర్యటన వివరాలు:

image

☞ ఉ. 9 గంటలకు VR మున్సిపల్ హైస్కూల్‌ను ప్రారంబోత్సవం
☞ 11 గంటలకు సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు
☞ మ.12 గంటలకు నాయకుల సమన్వయ సమావేశానికి హాజరవుతారు
☞ సాయంత్రం 4 గంటలకు బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

News July 6, 2025

మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

image

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.

News July 6, 2025

ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: కలెక్టర్

image

నెల్లూరు బారాషహిద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పండుగ ఏర్పాట్లు, భద్రత, వసతులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు.