News January 24, 2025
అంతర్గాం: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

అంతర్గాం మండలం ముర్ముర్ గ్రామంలో నిన్న పెసరి సత్తమ్మ కిరాణ షాపు వద్ద ఉండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మెడలో ఉన్న 3 తులాల గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న SI వెంకటస్వామి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈరోజు ఇద్దరు నిందితులను ఎల్లంపల్లి డ్యాం వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.
Similar News
News November 24, 2025
గులాబీలో చీడలను ఎలా నివారించవచ్చు?

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.
News November 24, 2025
జగిత్యాల: ‘ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి’

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం పలువురి నుంచి ఆయన ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. 57 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
News November 24, 2025
వారంలోగా సమస్యలు పరిష్కరించాలి: కాకినాడ ఎస్పీ

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 అర్జీలు వచ్చాయి. వీటిలో భూ తగాదాలు 10, కుటుంబ సమస్యలు 8, ఇతరత్రా 24 ఉన్నట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. అర్జీదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ అర్జీలను వారంలోగా పరిష్కరించాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలను ఎస్పీ ఆదేశించారు.


