News January 30, 2025
అంతర్గాం: AUGUSTలో పదవీ విరమణ.. అంతలోనే విషాదం

ఆగస్టులో పదవీ <<15299811>>విరమణ <<>>ఉండగా.. గుండెపోటుతో అంతర్గాం MPDO మృతిచెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఇటీవల ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. అయినా కూడా ప్రజాపాలన గ్రామసభలకు హాజరవుతున్నారు. ఈక్రమంలో బుధవారం హెల్త్‌చెకప్‌కు HYD వెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కాగా, మంచిర్యాలతో నివాసం ఉంటున్నారు.
Similar News
News February 14, 2025
నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ తన SM ఖాతాలో షేర్ చేశారు. ‘నాన్న లేని లోటు పూడ్చలేనిది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటా. థాంక్యూ నాన్నా’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. కాగా రాహుల్ పలు తెలుగు సినిమాల్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేశారు. సింగర్ చిన్మయి శ్రీపాదను ఆయన పెళ్లాడారు.
News February 14, 2025
సంగారెడ్డి: రేపు ప్రభుత్వ పాఠశాలలో పీటీఎం సమావేశం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రేపు తల్లిదండ్రుల(పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.
News February 14, 2025
RCB: కొత్త కెప్టెన్.. కొత్త ఆశలు.. కొత్త కలలు..

ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్ నియమితులయ్యారు. కొత్త కెప్టెన్ రాకతో ఈసారైనా ఆర్సీబీ కప్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏళ్లుగా కలగా మిగిలిన ట్రోఫీని పాటిదార్ సారథ్యంలో దక్కించుకోవాలని ఎదురు చూస్తున్నారు. కాగా RCBకి ఇప్పటివరకు ఏడుగురు కెప్టెన్లుగా (ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరీ, కోహ్లీ, వాట్సన్, డుప్లెసిస్) చేశారు. వారిలో ఏ ఒక్కరు ఆ జట్టుకు కప్‌ను అందించలేకపోయారు.