News October 16, 2024
అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలలో పైడిరాజుకు కాంస్య పతకం

సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన కనకల పైడిరాజు ఈనెల 10 నుంచి 19 వరకు మలేషియాలో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో 800 మీటర్ల రన్నింగ్లో కాంస్య పతకం సాధించినట్లు ఆమె గురువు పొట్నూరు శ్రీరాములు తెలిపారు. 36వ మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొన్న పైడిరాజు భారతదేశానికి 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
Similar News
News October 30, 2025
VZM: జిల్లా కలెక్టర్, యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ సమయంలో సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన వీసీలో అభినందించారు. తుఫాన్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూపిన అంకితభావాన్ని సీఎం ప్రశంసించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం అభినందనలకు ధన్యవాదాలు తెలిపారు.
News October 29, 2025
VZM: ‘రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు’

మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాణిక్యాల నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News October 29, 2025
విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాల అంచనాలను తక్షణం పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు బుధవారం ఆదేశించారు. శాఖలవారీగా నిజమైన వివరాలు, ఫొటోలు సహా అంచనాలు పంపాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం సహాయాన్ని వెంటనే అందించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో 24 గంటలు కృషి చేసిన అధికారులు, సచివాలయ సిబ్బందిని అభినందించారు.


