News March 13, 2025

అంతర్జాతీయ కళాపోటీల్లో ADB వాసికి అవార్డ్

image

దేశంలోని కళాకారులు, 5 దేశాలకు పైగా NRIల మధ్య నిర్వహించిన సెషన్ 16వ అంతర్జాతీయ కళాపోటీల్లో ADB టీచర్స్ కాలనీకి చెందిన గాధరి చంద్రశేఖర్ ప్రతిభ కనబర్చాడు. ఇన్నోవిజే గ్లోబల్ టాలెంట్ సెర్చ్ ర్యాంక్ స్లాట్ ప్రకారం ఐఏసీ నుంచి డ్రాయింగ్, పెయింటింగ్ విభాగంలో ది మెడల్ ఆఫ్ అప్రిషియేషన్‌తో పాటు ది లెటర్ ఆఫ్ రికగ్నిషన్ లెవల్-2లో అవార్డు అందుకున్నాడు. అర్హులైన కళాకారుల్లో ఒకరిగా పేరు సాధించుకున్నారు.

Similar News

News March 17, 2026

ఆదిలాబాద్: మే 20న భారీ జాబ్ మేళా.. 7వేల కొలువులు!

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మే 20న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. ఈ మేళా ద్వారా సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ప్రారంభంలో వేతనాలు తక్కువగా ఉన్నా, కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని యువతకు సూచించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ADB: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రహదారి భద్రతపై పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా నియమాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.