News June 11, 2024
అంతర్జాతీయ టోర్నీలో అమలాపురం విద్యార్థుల ప్రతిభ

భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నీలో అమలాపురం విద్యార్థులు ప్రతిభ కనపరిచారని అకాడమీ ప్రిన్సిపల్ వెంకట సురేష్ తెలిపారు. ఓపెన్ విభాగంలో కేశనకుర్తి రాజేష్, తాడి సాయివెంకటేష్ చెరో రూ.10 వేలు, ద్రాక్షారపు సాత్విక్ రూ.7 వేల నగదు బహుమతిని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు జరిగిన పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి 300 మంది పాల్గొన్నారన్నారు.
Similar News
News March 21, 2025
రాజమండ్రిలో అధికారుల మెరుపు దాడులు

తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం శుక్రవారం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేసింది. రాష్ట్రంలోని యువత మత్తు పదార్థాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నట్లు సమాచారం ఉండటంతో దాడులు నిర్వహించామని విజిలెన్స్ అధికారి ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. రాజమండ్రి గణేశ్ చౌక్ వద్ద ఉన్న ఓ మెడికల్ ఏజెన్సీలో ట్రెమడల్ మెడిసిన్ స్వాధీనం చేసుకున్నారు.
News March 21, 2025
తూ.గో జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

తూ.గో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా రాజమండ్రిలో 36 డిగ్రీలు, గోపాలపురం 32 డిగ్రీలు, కొవ్వూరు 36 డిగ్రీలు నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 21, 2025
రైలు నుంచి జారిపడి బిక్కవోలు వాసి మృతి

భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గురువారం జారిపడి మృతి చెందాడని రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా బిక్కవోలుకు చెందిన అంబటి సుబ్బా రెడ్డి (69) సింహాద్రి రైల్లో రాజమండ్రి వైపు వెళుతున్న సమయంలో జారిపడి మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.