News February 13, 2025

అంతర్జాతీయ పోటీల్లో నిర్మల్ బిడ్డల ప్రతిభ

image

ఇటీవల దిల్లీలో నిర్వహించిన నాలుగో ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కిక్ బాక్సింగ్ సెక్రటరీ మహిపాల్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన అక్షయ, నాగలక్ష్మితో పాటు జట్టును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు, శిక్షకులు తదితరులున్నారు.

Similar News

News March 12, 2025

రేపు కలెక్టర్ అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. రేపు అనంత రేడియో స్టేషన్ నుంచి ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ప్రజలతో సమస్యలు తెలుసుకోనున్నారు. 08554-225533 నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు.

News March 12, 2025

ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సలహాలివ్వండి: కలెక్టర్

image

భారత రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులందరిని సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఈ మేరకు రాజకీయ పార్టీలకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ఏప్రిల్ 30 లోపు సలహాలు, సూచనలు అందించాలని ఆమె కోరారు.

News March 12, 2025

ఒంగోలు: అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

image

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో జరుగుతున్న నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ పురోగతిపై మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేశారు.

error: Content is protected !!