News March 6, 2025
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తాం: మంత్రి నారాయణ

అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. బుధవారం మంత్రి జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రూ.64 వేల కోట్లతో 5000 ఎకరాలలో రాజధాని నిర్మిస్తామని, ఇప్పటికే రూ.50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
నేడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకై ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి నేడు. 1901లో మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. గాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాలను అనుసరిస్తూ హరిజనోద్ధరణ కోసం అహర్నిశలు శ్రమించిన మహా పురుషుడు అమరజీవి శ్రీ పొట్టిరాములు.
News March 16, 2025
ఆ టీడీపీ నేతలను కచ్చితంగా జైలుకు పంపుతాం: కాకాణి

అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, ఎర్రచందనం కొల్లగొట్టిన వారిని వదిలే ప్రశక్తే లేదని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. 2014లో CM చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందన్న ఆయన.. బాధ్యులపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 15 ఏళ్లలో అగ్రిగోల్డ్ భూముల్లో దాదాపు రూ.3.5కోట్ల వృక్ష సంపదను టీడీపీ నేతల కొల్లగొట్టారని, వారిని జైలుకు పంపుతామని కాకాణి వార్నింగ్ ఇచ్చారు.
News March 15, 2025
నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల జనరల్ విభాగంలో 23,199 మందికి గాను 458 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 431 మందికి గాను 61 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులందరికీ ఆర్‌ఐఓ ధన్యవాదాలు తెలిపారు.