News March 5, 2025
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. గురజాడ కళాక్షేత్రం వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.
Similar News
News September 13, 2025
విశాఖ: బీజేపీ సభ ఏర్పాట్ల పరిశీలన

విశాఖ రైల్వే మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని మంత్రి సత్య కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పరిశీలించారు. జేపీ నడ్డా హాజరవుతున్న ఈ సభకు మరి కొంతమంది ప్రముఖులు కూడా రానున్నారని వారు పేర్కొన్నారు. దీంతో కార్యకర్తల సమీకరణ, స్వాగత ఫ్లెక్సీలను పరిశీలించారు. సభకు దాదాపు 20,000 మంది హాజరవుతారని అంచనా.
News September 13, 2025
జగ్గు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి

గాజువాక సమీపంలోని జగ్గు జంక్షన్ వద్ద నడిచి వెళుతున్న మహిళను ట్రాలర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నగంట్యాడ సమీపంలో నివాసముంటున్న విజయలక్ష్మి జగ్గు జంక్షన్ సమీపంలో నడిచి వెళుతుండగా స్టీల్ప్లాంట్ నుంచి వస్తున్న ట్రాలర్ ఢీకొంది. ఘటనాస్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News September 13, 2025
విశాఖ: NMMS పరీక్షకు దరఖాస్తు చేశారా?

2025-26 విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ తెలిపారు. రూ.3.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న 8వ తరగతి విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 30వ తేదీలోగా www.bse.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్ 7న జరుగుతుంది.