News May 3, 2024
అంతర్జాతీయ మార్కెట్లో కొల్లాపూర్ మామిడి పండ్లకు డిమాండ్

కొల్లాపూర్ సంస్థానాధీశులు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని(రాజుగారి) పెద్దతోట, చుక్కాయిపల్లి క్రిష్ణ విలాస్ లో మామిడి తోటల సాగును ప్రారంభించారు. APలోని కృష్ణా జిల్లా నూజివీడు నుంచి తెచ్చిన మామిడి మొక్కలు.. కొల్లాపూర్ ప్రాంతం నేల, వాతావరణంలో కాయలు నాణ్యంగా, మంచి పరిమాణంతో పెరిగి, తీపిగా,ఆకర్షణీయంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం 25 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.
Similar News
News October 29, 2025
MBNR: భారీ వర్షాలు.. ఎస్పీ కీలక సూచనలు

MBNRలోని పలుచెరువులను జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.
✒భారీ వర్షాల కారణంగా చెరువులు,వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✒చేపల వేటకు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించకూడదు
✒చిన్నపిల్లలను, వృద్ధులను నీటి ప్రాంతాల వద్దకు వెళ్లనీయకూడదు
✒వర్షపు నీరు ఎక్కువగా చేరిన రోడ్లు, లోతైన మడుగులు, డ్రైన్లను దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు.
News October 29, 2025
దేవరకద్ర: చేప పిల్లలను వదిలిన మంత్రి, ఎమ్మెల్యే

గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని, మత్స్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి విమర్శించారు. కోయిల్సాగర్ ప్రాజెక్టులో మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్తో కలిసి చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దేవరకద్రలో ఈసారి 82 మిల్లీమీటర్ల సైజులో 2.5 లక్షల చేప పిల్లలను వదిలినట్లు తెలిపారు.
News October 29, 2025
MBNR: భారీ వర్షాలు.. రంగంలోకి ఎస్పీ

గత రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి స్వయంగా పెద్ద చెరువు పరిసర ప్రాంతాలు, రామయబోలి ట్యాంకుబండు, ఎర్రకుంట చెరువు, ఆలీ మార్ట్–రాయచూరు రహదారి ప్రాంతాలను సమీక్షించారు. మున్సిపల్, ఇరిగేషన్, వన్ టౌన్ CI అప్పయ్య తదితర అధికారులతో కలిసి నీటి మట్టం, ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు.


