News November 30, 2024
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల వేడుకలు
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయసంచాలకులు కె.కవిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతుందన్నారు. ఇటీవల జిల్లాలో విభిన్నప్రతిభావంతులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని ఆమె వెల్లడించారు.
Similar News
News December 5, 2024
ఆమదాలవలస: ‘ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోండి’
ఆమదాలవలస పెద్ద జొన్నవలస గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లయర్స్ ఎండీ మంజీర్ జిలాని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి ఫర్మానా అహ్మద్ ఖాన్, ఎమ్మార్వో రాంబాబు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
News December 4, 2024
మెలియాపుట్టి: ఆవులపై పెద్దపులి దాడి.. రెండు మృతి
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం గొప్పిలి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో పెద్దపులి దాడులు చేసిందని పాతపట్నం అటవీశాఖ సెక్షన్ రేంజర్ పట్ట అమ్మి నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. పెద్దపులి ప్రస్తుతం ఒడిశా ప్రాంతానికి తరలి వెళుతున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో గొప్పిలి వద్ద రెండు ఆవులపై దాడి చేయడంతో మృతి చెందాయని ఆయన స్పష్టం చేశారు.
News December 4, 2024
పాతపట్నం: ఆవును చంపిన పెద్దపులి
గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. పాతపట్నం మండలం తిమరా గ్రామ సమీపంలో ఒక ఆవుపై దాడి చేసి దాన్ని సమీప తోటల్లోకి లాక్కెళ్లి తినేసిన ఆనవాళ్లను మంగళవారం అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. అనంతరం రొంపివలస మీదుగా కొరసవాడ గ్రామం వైపు పెద్దపులి వెళ్లినట్లు అడుగుజాడలు గుర్తించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాతపట్నం అటవీశాఖ రేంజ్ అధికారి అమ్మన్నాయుడు తెలిపారు.