News June 15, 2024
అంతర్జాతీయ సదస్సుకు తారా డిగ్రీ అధ్యాపకురాలు
సంగారెడ్డి ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు పట్లోళ్ల అశ్విని రేపటి నుంచి 19 వరకు చైనాలో జరిగే 10వ ఏషియన్ పసిఫిక్ ఎక్సర్ సైజ్ స్పోర్ట్స్ సైన్స్ – 2024 సదస్సుకు ఎంపికయ్యారు. చైనాలో జరిగే సదస్సుకు 46 దేశాల ప్రతినిధులు పాల్గొంటుండగా.. ఈ సదస్సుకు భారత్ నుంచి ఫిజికల్ విభాగంలో అశ్విని ఒక్కరే ఎంపికయ్యారు.
Similar News
News September 13, 2024
MDK: హత్యాయత్నం కేసులో నిందితునికి 7ఏళ్లు జైలు
హాత్యాయత్నం కేసులో నేరస్థుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష రూ.5వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. సదాశివపేట మండలం కోనాపూర్‌కు చెందిన యాదయ్య పక్కన స్థలంలో వీరయ్య పగిలిన కల్లు సీసాలు వేసేవాడు. ఇదేంటని అడిగినందుకు యాదయ్యపై వీరయ్య కత్తితో హత్యాయత్నం చేశారు. నేరం రుజువు కావడంతో వీరయ్యకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.
News September 13, 2024
మెదక్: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’
ఈనెల 28 నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో గురువారం వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.
News September 12, 2024
అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నేత సీతారాం ఏచూరి: మంత్రి పొన్నం
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అకాల మరణం తనని తీవ్ర ధ్రిగ్బాంతికి గురిచేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సీతారాం ఏచూరి కింది స్థాయి నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడు అని, ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాల్లో పోరాడారని గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారికి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.