News February 1, 2025

అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

image

స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ సహకార సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాలపై సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. జనవరి మాసంలో సహకార విలువలను స్వీకరించే సంవత్సరంగా ప్రారంభిస్తూ.. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News October 23, 2025

తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో

image

రాబోయే తుఫాన్ నేపథ్యంలో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఆర్డీవో సందీప్ బుధవారం సూచించారు. కర్నూలు రూరల్ మండలంలో 11, సి.బెళగల్ మండలంలో 9 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. వరద కారణంగా ఏవైనా ఇబ్బందులు కలిగితే ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ 08518-241380 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News October 23, 2025

మెటాలో 600 ఉద్యోగులపై వేటు!

image

మెటా కంపెనీ AI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు US మీడియా పేర్కొంది. దీంతో ఫేస్‌బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్, ప్రొడక్ట్ ఏఐ, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ప్రభావం పడనుంది. కాగా ఈ తొలగింపుతో అనవసర విధులు తగ్గి ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తారని మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ వాంగ్ తెలిపారు. అయితే కొత్త నియామకాలపై దీని ఎఫెక్ట్ ఉండదని తెలుస్తోంది.

News October 23, 2025

ఈనెల 25న కర్నూలులో జాబ్ మేళా

image

ఈ నెల 25న కర్నూలులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి బుధవారం తెలిపారు. ఈ మేళాలో ఆరంజ్ ఫైనాన్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు విద్యార్హత పత్రాలు, ఫొటోలు తీసుకుని హాజరుకావాలని సూచించారు. www.ncs.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.