News May 18, 2024

అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం: గోపీనాథ్ రెడ్డి

image

ఆంధ్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏపీ‌ఎల్ సీజన్‌పై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 30 నుంచి జూలై 13 వరకు ఈ సీజన్ కొనసాగుతుందని వివరించారు. మొత్తం 19 మ్యాచులు జరగనున్నట్లు వివరించారు. కడపలో 7, విశాఖలో 12 మ్యాచులు నిర్వహిస్తామన్నారు.

Similar News

News December 4, 2024

విశాఖ: ప్రమాదవశాత్తు గాయపడ్డ అంగన్వాడీ టీచర్‌

image

విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కయ్యపాలెంలోని 43వ వార్డు శ్రీనివాసనగర్‌లో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసా బేగం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో గాయపడింది. స్థానికులు సమాచారం మేరకు 4వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 4, 2024

విశాఖ జూలో జిరాఫీ జంట సందడి

image

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో సుమారు మూడేళ్ల మగ, ఐదేళ్ల ఆడ జిరాఫీ జంట సందర్శకులను అలరిస్తూ సందడి చేస్తున్నాయి. ఇటీవల కోల్‌కతా జూ నుంచి తీసుకొచ్చిన ఈ జిరాఫీల జంట విశాఖ వాతావరణానికి అలవాటు పడి “నీకు నేను.. నాకు నీవు”అనే రీతిలో వాటి హావభావాలతో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. విశాఖ జూకు ఈ యువ జిరాఫీ జంట స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.

News December 4, 2024

విశాఖలో స్వల్ప భూప్రకంపన..!

image

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. మరి మీ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయా?