News February 7, 2025

అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాలు, స్టాక్ పాయింట్ల ద్వారా స‌ర‌ఫ‌రా ప్ర‌క్రియ‌లు స‌జావుగా జ‌రిగేలా వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో పనిచేయాల‌ని అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. శుక్ర‌వారం జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప‌ర్యావ‌ర‌ణ‌, ఇత‌ర అనుమ‌తుల ఆధారంగా త‌వ్వ‌కాలు జ‌రిగేలా, స‌ర‌ఫ‌రాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు.

Similar News

News November 26, 2025

వనపర్తి: నామినేషన్లకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియను గురువారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు ఇప్పటికే టీ.పోల్‌లో అప్‌లోడ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 26, 2025

GNT: హెడ్ కానిస్టేబుల్ చీటింగ్

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలువురు పోలీసులను అధిక డబ్బు పేరుతో మోసం చేసిన ఘటన చోటు చేసుకుంది. పల్నాడుకి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ బియాండ్ ఇన్ ఫీనిటీ పేరుతో పోలీసులను రూ.5,500తో రిజిస్టర్ అయ్యి రూ.25 వేలు కడితే 26 లక్షల కారు, క్రిప్టో కరెన్సీ పేరుతో కాయిన్స్ కొంటే కోటీశ్వరులు అవుతారని నమ్మించి ఆన్లైన్‌లో డబ్బులు కట్టించి మోసం చేశాడు. గుంటూరు, పల్నాడు పోలీసులు ఎక్కువ మోసపోయినట్లు సమాచారం.

News November 26, 2025

పెద్దపల్లిలో కుమారుడి కళ్లను దానం చేసిన తండ్రి

image

పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫుట్‌బాల్ ఆడుతూ కిందపడి 10వ తరగతి విద్యార్థి కన్నవేన <<18394891>>ప్రతీక్<<>> మృతి చెందాడు. పెద్దపల్లి, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించినా ఫలితం దక్కలేదు. తన కుమారుడు మరణించినా కళ్లు సజీవంగా ఉండాలని ప్రతీక్ తండ్రి కుమారస్వామి నిర్ణయించుకున్నారు. లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ప్రతీక్ రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి దానం చేశారు.