News July 19, 2024

అంతర్వేదిలో రోడ్లపైనే చేపల వేట

image

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జనం రోడ్ల మీదే వలలు వేసి చేపలు పడుతున్నారు. భారీ వర్షాలకు చుట్టూ ఉన్న చెరువులు నుంచి చేపలు రోడ్డుపైకి వస్తున్నాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డుపైకి భారీగా చేపలు చేరుతున్నాయి. రోడ్డు పైనే చేపలు పడుతూ యువకులు సందడి చేస్తున్నారు. 

Similar News

News November 19, 2025

ప్రతి 3వ శుక్రవారం ఫిర్యాదులకు అవకాశం: కలెక్టర్

image

ఉద్యోగుల ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా ప్రతి మూడవ శుక్రవారం ఉద్యోగులు తమ వ్యక్తిగత సమస్యలు సహా అన్ని రకాల ఫిర్యాదులను నేరుగా సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రకటించారు. అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక ఐడీతో పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రత్యేక నంబర్ ద్వారా ఉద్యోగి తన ఫిర్యాదు స్థితిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.

News November 19, 2025

నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతులకు PM-KISAN 21, అన్నదాత సుఖీభవ–2 పథకాల కింద మొత్తం రూ.7,699.90 లక్షల నిధులు జమ కానున్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఎస్.కే స్థాయి వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.