News January 31, 2025
అంతర్వేది వరకు బస్సులు నడపాలని వినతి

అంతర్వేది కళ్యాణోత్సవాలకు స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేయరాదని బజరంగ్ దళ్ నాయకుడు శిరంగు నాయుడు కోరారు. అమలాపురం నుంచి మలికిపురం వరకే కాకుండా అంతర్వేది వరకు పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని విన్నవించారు. ఈ మేరకు ఆయన అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ చర్ల సూర్యనారాయణను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. భక్తులు రద్దీకి తగ్గట్టుగా పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని కోరారు.
Similar News
News February 14, 2025
తెలంగాణ ఉద్యమంపై పుస్తకాలు రావాలి: CM

తెలంగాణ ఉద్యమ చరిత్రపై మరిన్ని సమగ్రమైన పుస్తకాలు రావాలని CM రేవంత్ ఆకాంక్షించారు. మాజీ MP దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకాన్ని CM ఆవిష్కరించారు. ‘TG ఉద్యమంపై లోతైన చర్చ జరగాలి. ఎన్నో వర్గాలు పాల్గొన్నా, ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారు. ఉద్యమం టైంలో ప్రజలంతా తమ వాహనాలు, ఆఫీసులు, గుండెలపై TG అని రాసుకున్నారు. ఇప్పుడు ప్రజలు కోరుకున్నట్లుగానే TSను TGగా మార్చాం’ అని CM వెల్లడించారు.
News February 14, 2025
తుని రైల్వే స్టేషన్‌లో వృద్ధుడి మృతదేహం

తుని రైల్వేస్టేషన్‌లో బుకింగ్ కౌంటర్ వద్ద ఓ వృద్ధుడు మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాస రావు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఉన్న ఆధారాలు ప్రకారం నక్కపల్లి మండలం పెద్ద తీనార్ల గ్రామానికి చెందిన అడవి రాజు (70)గా గుర్తించామని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీ రూమ్‌లో భద్రపరిచామన్నారు.
News February 14, 2025
BRS తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి: ఖానాపూర్ MLA

నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. ఉట్నూర్‌లోని కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని, BRS తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు.