News November 28, 2024

అందరికీ వేదికైన హైదరాబాద్!

image

వరుస కార్యక్రమాలతో HYD వాతావరణం సందడిగా మారనుంది. రేపు BRS ఆధ్వర్యంలో దీక్షా దివస్ పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 1న సికింద్రాబాద్ పరేడ్‌ మైదానంలో మాల సంఘాలు సింహగర్జనకు పిలుపునిచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ డిసెంబర్‌ 7న ఆటోలు బంద్‌ చేసి నిరసన తెలుపుతామని ఆటో JAC ప్రకటించింది. డిసెంబర్‌ తొలివారంలోనే CM రేవంత్ రెడ్డి పాతబస్తీలో పర్యటించే అవకాశం ఉంది. దీంతో అంతా సన్నద్ధం అవుతున్నారు.

Similar News

News November 16, 2025

రంగారెడ్డి జిల్లాలో 2 కోట్ల చేపపిల్లల లక్ష్యం

image

రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు వెయ్యికిపైగా ఉన్నాయి. వాటిలో 2 కోట్లకుపైగా చేప పిల్లలు అవసరం ఉండగా.. 59 లక్షలు మాత్రమే వచ్చాయి. అయితే జిల్లాలో సుమారు 15వేల మంది చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మిగతా వాటిని కూడా పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. కాగా, మరిన్ని చేప పిల్లల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమ తెలిపారు.

News November 15, 2025

రంగారెడ్డి: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జీ.ఆశన్న సూచించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 2025-26 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలనన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు.

News November 12, 2025

FLASH: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేత

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.