News November 28, 2024

అందరికీ వేదికైన హైదరాబాద్!

image

వరుస కార్యక్రమాలతో HYD వాతావరణం సందడిగా మారనుంది. రేపు BRS ఆధ్వర్యంలో దీక్షా దివస్ పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 1న సికింద్రాబాద్ పరేడ్‌ మైదానంలో మాల సంఘాలు సింహగర్జనకు పిలుపునిచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ డిసెంబర్‌ 7న ఆటోలు బంద్‌ చేసి నిరసన తెలుపుతామని ఆటో JAC ప్రకటించింది. డిసెంబర్‌ తొలివారంలోనే CM రేవంత్ రెడ్డి పాతబస్తీలో పర్యటించే అవకాశం ఉంది. దీంతో అంతా సన్నద్ధం అవుతున్నారు.

Similar News

News November 23, 2025

HYD: ఇవాళ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి

image

ఇవాళ మద్యాహ్నం ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. DEC 8 నుంచి 11వ తేది వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్- 2025ను నిర్వహిస్తోంది. పనుల ఏర్పాట్లను పలువురు మంత్రులు, అధికారులతో కలిసి సీఎం పరిశీలించనున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్ పేటలో 300 ఎకరాల విస్తీర్ణంలో సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. దీనికి 3వేల మంది అతిథులు రానున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

News November 23, 2025

HYD: సైబర్ నేరాలపై ప్రతిజ్ఞ చేయించిన సీపీ

image

సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో ‘జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్’ పేరుతో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోసపూరిత లింక్‌ను ఓపెన్ చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, సైబర్ పోర్టల్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.

News November 23, 2025

ఇలా అయితే భవిష్యత్‌లో HYDకు గండమే!

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల వరద ప్రవాహాంతో వచ్చే వ్యర్థాలు అడుగున చేరి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. ఇటీవల నీటి వనరుల విభాగం ఉన్నతస్థాయి కమిటీ పరిశీలనలో భారీగా పూడిక పేరుకుపోయి నీటి సామర్థ్యం సాధారణ స్థాయి కంటే తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నీటి సామర్థ్యం 60% కంటే దిగువకు పడిపోతే భవిష్యత్తులో నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం ఉందని వెల్లడైంది.