News November 28, 2024
అందరికీ వేదికైన హైదరాబాద్!
వరుస కార్యక్రమాలతో HYD వాతావరణం సందడిగా మారనుంది. రేపు BRS ఆధ్వర్యంలో దీక్షా దివస్ పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మాల సంఘాలు సింహగర్జనకు పిలుపునిచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ డిసెంబర్ 7న ఆటోలు బంద్ చేసి నిరసన తెలుపుతామని ఆటో JAC ప్రకటించింది. డిసెంబర్ తొలివారంలోనే CM రేవంత్ రెడ్డి పాతబస్తీలో పర్యటించే అవకాశం ఉంది. దీంతో అంతా సన్నద్ధం అవుతున్నారు.
Similar News
News December 2, 2024
HYD: చేవెళ్ల యాక్సిడెంట్.. CM రేవంత్ దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఈ ప్రమాదంలో రైతులు ప్రేమ్(ఆలూరు), రాములు(ఆలూరు), సుజాత(ఖానాపూర్ ఇంద్రారెడ్డినగర్) అక్కడికక్కడే చనిపోయారు.
News December 2, 2024
HYD: మాలలకు రాజ్యాంగం మద్దతు ఉంది: రాజేశ్ మహాసేన
పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జన సభకు ఆంధ్రా నుంచి పిలుపు అందుకున్న రాజేశ్ మహాసేన వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంద కృష్ణ మాదిగ 30 ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర నాయకులు, సుప్రీంకోర్టు మద్దతు ఉంది అని చెప్పుకుంటు తిరుగుతున్నారన్నారు. దేశం మొత్తం మద్దతు వుండొచ్చు కానీ తమ జాతికి డా.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మాలలు భారీగా తరలివచ్చారు.
News December 2, 2024
HYD: చుక్కా రామయ్య ఆరోగ్యంపై హరీశ్‌రావు ఆరా
నల్లకుంటలోని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఐఐటీ చుక్కా రామయ్య ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్‌తో కలిసి హరీశ్‌రావు ఆయనతో ముచ్చటించారు. గత నెల 20న చుక్కా రామయ్య పుట్టినరోజు రాలేకపోయానని తెలిపారు. దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర నాయకులు ఉన్నారు.