News June 17, 2024

అందరిపై అల్లా దయ ఉండాలి: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ ఎం.హరి నారాయణన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. దానధర్మాలు, త్యాగాలకు ప్రతీకగా నిలిచే పండగల్లో బక్రీద్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. జిల్లాలోని ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో బక్రీద్ జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై అల్లా ఆశీస్సులు ఉండాలని.. అందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Similar News

News January 14, 2026

నెల్లూరు జిల్లాలో 1216 టీచర్ పోస్టులు ఖాళీ

image

నెల్లూరు జిల్లాలో 1,216 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. SA పోస్టులను 70 శాతం ప్రమోషన్స్‌‌తో, 30 శాతం DSCతో భర్తీ చేస్తారు. SAలు తెలుగు(54), సంస్కృతం(3), ఉర్దూ(22), హిందీ(35), ఆంగ్లం(44), MATHS(40), PS(22), BS(47), SS(64), PET(27), స్పెషల్ ఎడ్యుకేషన్(20) ఖాళీలు ఉన్నాయి. SGT కింద 786 పోస్టులు ఉండగా వీటిని DSC-2026లో భర్తీ చేసే అవకాశం ఉందని DEO బాలాజీ రావు వెల్లడించారు.

News January 14, 2026

నెల్లూరు: కయ్యానికి.. కొకొరోకో..!

image

సంక్రాంతి అంటే.. సరదా. కానీ సరదా మాటున ‘కోడి’ పందేలు నిర్వహించడం, వేలకు వేలు ఖర్చు చేయడం, కోళ్లను హింసించడం జరుగుతోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, పెన్నా పరివాహకం పొట్టేపాలెం, కోవూరు వంటి ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశం ఉంది. విడవలూరు (M) రామతీర్ధం, పట్టపు పాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతాయిని సమాచారం.