News February 3, 2025

అందరి చూపు త్రిషపైనే..!

image

భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 309 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచారు. బౌలింగ్‌లోనూ రాణించి 7 వికెట్లు తీశారు. ఇటీవల ఆసియా కప్ గెలవడంలోనూ ఈమె కీలక పాత్ర పోషించారు. దీంతో అందరి చూపు ఈ భద్రాచలం అమ్మాయిపైనే ఉంది. ఇలానే ఆడితే సినియర్ జట్టుకు ఎంపిక కావడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News February 13, 2025

BREAKING: 19 మంది మావోయిస్టుల లొంగుబాటు

image

భద్రాద్రి: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ప్రకటించారు. లొంగిపోయి సాధారణ జీవితం గడపటానికి వారు ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ పాల్గొన్నారు.

News February 13, 2025

మున్సిపాలిటీలకు టెన్షన్​గా పన్ను వసూళ్లు

image

ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు పన్ను వసూళ్లు టెన్షన్​గా మారింది. ఖమ్మం కార్పొరేషన్​, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మధిర మున్సిపాలిటీల్లో 50% పైగా ఆస్తి పన్నులు వసూళ్లయ్యాయి. వైరా మున్సిపాలిటీలో కేవలం 27 శాతమే వసూళ్లయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్షలో లక్ష్యానికి దూరంగా మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్​ అయినట్టు తెలుస్తోంది. వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశించినట్టు సమాచారం.

News February 13, 2025

కూసుమంచి: కల్లులో పురుగు మందు కలిపాడు..!

image

కల్లు అమ్మకంలో వచ్చిన విభేదాలతో ఓ గీత కార్మికుడు మరోగీత కార్మికుడి కల్లుకుండలో పురుగు మందు కలిపిన ఘటన కూసుమంచి మండలంలో వెలుగు చూసింది. మొక్క వీరబాబుకు ఐతగాని రమేష్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. దీనిని మనసులో పెట్టుకున్న రమేష్, వీరబాబుకి చెందిన కల్లు కుండలో విషం కలిపాడు. చెట్టు ఎక్కగా వాసన రావడంతో అనుమానం వచ్చిన వీరబాబు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించగా రమేష్ అంగీకరించడంతో కేసు నమోదు చేశారు.

error: Content is protected !!