News April 18, 2024
అందరి చూపు మంత్రి పెద్దిరెడ్డి ఆస్తి వివరాలపైనే..!
నామినేషన్ల సమయంలో అభ్యర్థులు తమ ఆస్తి, కేసుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రూ.130 కోట్ల ఆస్తి, రూ.20 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపారు. తనకు కారు లేదని చెప్పారు. తనకు 50 గ్రామల బంగారం, భార్యకు 1.5 కేజీల బంగారం ఉందని వెల్లడించారు. మరి తాజా ఎన్నికల్లో ఆయన తన ఆస్తి ఎంత చూపిస్తారనేది జిల్లా ప్రజల్లో ఆసక్తి రేపుతోంది.
Similar News
News September 18, 2024
తిరుపతి: 108లో ఉద్యోగ అవకాశాలు
108 వాహనాల్లో ఫైలట్ (డ్రైవర్), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి 108 సర్వీస్ జిల్లా మేనేజర్ సంజీవ రెడ్డి తెలిపారు. ఫైలెట్ పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణత, హెవీ డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వివరాలకు తిరుపతి మధురానగర్ లోని 108 సర్వీసెస్ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News September 18, 2024
తిరుమల: 21న వర్చువల్ సేవల కోటా విడుదల
తిరుమలలో వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
News September 17, 2024
18న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్‌లో కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.