News February 14, 2025
అందరూ ఆధార్ కలిగి ఉండాలి: ASF కలెక్టర్

జిల్లాలో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి యూఐడీఏఐ. డిప్యూటీ డైరెక్టర్ చైతన్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలలో చదివి విద్యార్థులు తప్పని సరిగా ఆధార్ కార్డు తీసుకోవాలన్నారు.
Similar News
News October 31, 2025
లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టవచ్చా?

లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం ప్రమాదకరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇలాంటి ప్రాంతాల్లో నిర్మించిన గృహాల్లోకి వర్షాకాలంలో నీరు వచ్చే అవకాశాలుంటాయి. ఇంట్లోకి తేమ చేరితే అనారోగ్యం వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో సౌరశక్తి, ప్రాణశక్తి కూడా తక్కువే. దీనివల్ల నివాసంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. స్థిరమైన, సుఖమైన జీవనం కోసం ఎత్తుగా, సమతలంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>
News October 31, 2025
సంగారెడ్డి: ‘ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి’

ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో క్లస్టర్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని చెప్పారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ పాల్గొన్నారు.
News October 31, 2025
సంగారెడ్డి: పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ పారితోష్ పంకజ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ పై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.


