News February 14, 2025

అందరూ ఆధార్ కలిగి ఉండాలి: ASF కలెక్టర్

image

జిల్లాలో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి యూఐడీఏఐ. డిప్యూటీ డైరెక్టర్ చైతన్య నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలలో చదివి విద్యార్థులు తప్పని సరిగా ఆధార్ కార్డు తీసుకోవాలన్నారు.

Similar News

News March 18, 2025

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ

image

యువత, విద్యార్థులు బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. ఆన్ లైన్ గేమ్స్ ఆడి యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని చెప్పారు. బెట్టింగ్‌ ఆడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిందని, దానిని మంచికి వినియోగించాలన్నారు.

News March 18, 2025

WGL: రైతులకు గుడ్ న్యూస్.. పెరిగిన పత్తి ధర..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా పెరిగింది. సోమవారం పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలకగా.. మంగళవారం రూ.6,975కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరలు మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.

News March 18, 2025

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు

image

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు గోడలపై దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో టెక్కలిలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద “దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్” అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఆకతాయిల పనే అని పలువురు అంటున్నారు. దీనిపై పలువురు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

error: Content is protected !!