News January 23, 2025

అందరూ ఆధ్యాత్మికతను అలవార్చుకోవాలి: ASF MLA

image

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవార్చుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని సావర్‌ఖేడ గ్రామంలో నిర్వహించిన ఆధ్యాత్మిక గురువు పులాజీబాబా ధ్యాన కేంద్ర వార్షికోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అంతకుముందు బాబా చిత్రపటానికి, గ్రంథాలకు పూజలు చేశారు. బాబా చెప్పిన భోధనలు అందరికీ ఆచరణీయమన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, బాబా భక్తులు తదితరులున్నారు.

Similar News

News February 10, 2025

కేసముద్రంలో నాలుగు కిలోల గంజాయి పట్టివేత

image

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 4కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ సర్వయ్య తెలిపిన వివరాలిలా.. నమ్మదగిన సమాచారం మేరకు 3 వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని తెలిసింది. దీంతో ఎస్సై మురళీధర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద తనిఖీ చేయగా 4కిలోల గంజాయి దొరికిందని సీఐ తెలిపారు.

News February 10, 2025

వైసీపీ ముఖ్య నేతలతో గుడివాడ సమావేశం

image

విశాఖ వైసీపీ ఆఫీసులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో ఇటీవల నియమించిన అనుబంధ సంఘాల అధ్యక్షులతో పలు విషయాలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, రమణికుమారి ఉన్నారు.

News February 10, 2025

జోగులాంబ: ఐదుగురు డ్రైవర్ల పై కేసులు నమోదు

image

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతితో ఇసుకను తరలిస్తున్న డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 5 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

error: Content is protected !!