News June 27, 2024
అందరూ బాగా కష్టపడ్డారు: చంద్రబాబు

టీడీపీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి పదవులిచ్చే బాధ్యత తనదేనని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కార్యకర్తలను ఎంతగా హింసించినా ఆత్మస్థైర్యం కోల్పోలేదన్నారు. పార్టీ కోసం సైనికుల్లా పని చేశారని ప్రశంసించారు.
Similar News
News November 22, 2025
చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

GDనెల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. RTC బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు వివరాలు మేరకు.. బైకుపై ముగ్గురు GDనెల్లూరు నుంచి ఎట్టేరికి వెళుతుండగా మోతరంగనపల్లి వద్ద బస్సు-బైకు ఢీకొన్నాయి. బైకుపై ఉన్న ఇద్దరు స్పాట్లో చనిపోయారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 22, 2025
చిత్తూరు: రూ.7కోట్ల దొంగతనం.. ఐదుగురు అరెస్ట్

బెంగళూరులో ATMకు తరలిస్తున్న రూ.7.19 కోట్లను దోపిడీ చేసిన కేసులో కర్ణాటక పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇదివరకే సస్పెండ్ అయిన పోలీస్ అన్నప్ప నాయక్, చోరీలో కీలకంగా వ్యవహరించిన జేవియర్, గోపి, నెల్సన్, నవీన్ను అరెస్టు చేసి సిద్దాపుర పోలీస్ స్టేషన్కు తరలించారు. చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద ఇన్నోవా కారును వదిలి వ్యాగనార్ కారులో పరారైన జేవియర్ను తమిళనాడులో అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకెళ్లారు.
News November 22, 2025
పుంగనూరు: రూ.770కు చేరిన టమాటా

తుఫాను నేపథ్యంలో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు శనివారం 57.94 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. నాణ్యత కలిగిన టమాటా 15 కిలోల బాక్స్ రూ.770 పలికింది. రెండో రకం రూ.500, మూడో రకం రూ.300 చొప్పున కొనుగోలు చేశారు.


