News October 15, 2024

అందరూ సెలవు ఇవ్వాల్సిందే: ప్రకాశం కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పందించారు. ముందస్తు జాగ్రత్తగా బుధవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అందరూ సెలవు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రేపు జిల్లాలో 200 మిల్లీ మీటర్ష అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని.. అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Similar News

News November 25, 2024

విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు: బాలినేని

image

తాను విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ” YSR మరణించాక మంత్రి, MLA పదవులు వదులుకున్నానన్నారు. చంద్రబాబు, పవన్ మెప్పు కోసమే నేను మాట్లాడుతున్నానని కొందరు అనడం సమంజసం కాదన్నారు. ఎవరి మెప్పు కోసమో నేను పనిచేయట్లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. YSR కుటుంబం అంటే ఒక్క జగనేనా.? ఏ షర్మిల, విజయమ్మ కాదా అని బాలినేని ప్రశ్నించారు.

News November 24, 2024

పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి: కలెక్టర్

image

పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శనివారం సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యా బోధనతో పాటు పారిశుధ్యం పైన కూడా దృష్టి సాధించాలన్నారు. తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఇంగ్లిష్, గణితంలో పిల్లల పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు.

News November 24, 2024

IPL వేలంలో మన ప్రకాశం కుర్రాడు.!

image

IPL మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందిన మనీశ్ రెడ్డి రూ.30 లక్షల బేస్ ఫ్రైస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మన ప్రకాశం జిల్లా ఆటగాడు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలెక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.