News August 31, 2024
అందుకే పోలవరం ఫైల్స్ దగ్ధం చేశారు: మాజీ MP భరత్

చంద్రబాబు నిర్వాహకం వల్లే పోలవరం ప్రాజెక్ట్ డ్యాంకు నష్టం వచ్చిందని కేంద్ర కమిటీ నిర్ధారించినట్లు మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మరుగున పడేసేందుకు పోలవరానికి సంబంధించిన ఫైల్స్ దగ్ధమైనట్లు నాటకం ఆడి, అమాయకులైన ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేశారని అన్నారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చడం కోసం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు.
Similar News
News February 10, 2025
రాజమండ్రి: బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ.. ట్రాఫిక్ జామ్

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ కొట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో సుమారు రెండు గంటలు పాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు బ్రిడ్జిపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సిబ్బంది సకాలంలో చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
News February 10, 2025
అనపర్తిలో పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

అనపర్తిలో ఓ యువకుడు పెళ్లైన ఏడాదికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI శ్రీను తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సాయి సాకేత్‌రెడ్డి కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. శనివారం పురుగుమందు తాగగా.. బంధువులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
News February 10, 2025
ఫ్లైట్ డోర్ తెరిచిన రాజమండ్రి ప్రయాణికుడు

విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడిపై కోరుకొండ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్యామ్ సుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం శనివారం రాత్రి మధురపూడి విమానాశ్రయానికి వచ్చింది. ల్యాండ్ అయిన తరువాత రాజమండ్రికి చెందిన ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో విమానం వెళ్లడానికి జాప్యం జరిగింది.