News June 24, 2024
అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో చేరా: పోచారం
తాను స్వలాభం కోసమో పదవి కోసమో కాంగ్రెస్‌లో చేరలేదని, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. కార్యకర్తల సూచన మేరకు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకే కాంగ్రెస్‌లోకి వెళ్లానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, నియోజకవర్గ అభివృద్దే లక్ష్యమని పోచారం స్పష్టం చేశారు.
Similar News
News November 14, 2024
బాన్సువాడ: రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి:పోచారం
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి మాట్లాడుతూ సిద్ధాపూర్ రిజర్వాయర్ తన ఆశయమని, ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్ళు అందాలన్నారు.
News November 14, 2024
NZB: ‘రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం’
నిజామాబాదు జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు నిలిపివేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమైనవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిజామాబాద్ డీఐజీ రమేశ్ రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పది రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యాలయ సిబ్బంది ఎలాంటి బందులు పాటించడం లేదని తెలిపారు.
News November 14, 2024
ACBకి చిక్కిన లింగంపేట ఎస్ఐ
కామారెడ్డి జిల్లా లింగపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామాస్వామి పోలీస్ స్టేషన్‌లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.