News April 14, 2025
అందువలనే భారీ ప్రాణ నష్టం: ఐజీ

మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో పాటు బాణసంచా తయారు చేసే షెడ్లు పక్కపక్కనే ఉండడం వల్లే భారీ ప్రాణ నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ ఐజీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. సోమవారం కైలాసపట్నంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఉమ్మడి విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో బాణసంచా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తయారీ కేంద్రాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Similar News
News April 22, 2025
BREAKING: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

హీరో మహేశ్ బాబుకు ED నోటీసులు పంపింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ED సోదాల్లో తేలింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేశ్ బాబు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది.
News April 22, 2025
డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పునర్విచారణ

AP: కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పునర్విచారణకు కాకినాడ SP బిందు మాధవ్ ఆదేశించారు. విచారణ అధికారిగా IPS అధికారిని నియమించారు. 60 రోజుల్లో విచారణ నివేదిక అందజేయాలన్నారు. 2022 మే 19న YCP MLC అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం సంచలనమైంది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చిందనే ఆరోపణలు వచ్చాయి.
News April 22, 2025
సిరిసిల్ల : నేడు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

జిల్లాలో మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. జిల్లాలో మొత్తం 9,310 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 5,065 మంది ఫస్టియర్, 4.245 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం నేడు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST