News January 13, 2025
అందోల్: మాజీ ఎంపీ భౌతికకాయానికి మంత్రి నివాళులు

నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు నివాళులు అర్పించారు. HYDచంపాపేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లి జగన్నాథం కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. జగన్నాథంతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని, ఎంపీగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఓ సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Similar News
News February 9, 2025
మాసాయిపేట: తల్లి మృతితో అనాథలైన పిల్లలు.. ఆదుకోండి

మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన వెంగలి అనిత(35) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. నాలుగేళ్లు క్రితం భర్త కర్ణ చనిపోవడంతో కుటుంబాన్ని ఆమె నెట్టుకొస్తుంది. తాజాగా అనిత మృతితో మానసిక దివ్యాంగులైన వారి ఇద్దరి పిల్లలు అనాథలుగా మిగిలారు. అంత్యక్రియలకు సైతం స్థోమత లేని స్థితిలో ఉన్నారని, దాతలు స్పందించి ఆ కుటంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News February 9, 2025
సిద్దిపేట: 10 రోజుల వ్యవధిలో నలుగురి మృతి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేటకు చెందిన భార్యాభర్తలు ఆకుల కనకయ్య, తార మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ప్రమాదంలో వారి కుమారుడు ఆకుల శ్రీనివాస్ తీవ్ర గాయాలతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 12 రోజుల వ్యవధిలో ఓ వైపు తండ్రి, అత్తామామ, భర్త మృతితో సృజన రోదనలు మిన్నంటాయి. వారి మరణంతో బంధువులు శోకసముద్రంలో మునిగారు.
News February 9, 2025
మెదక్: నకిలీ బంగారంతో భారీ మోసం.. నలుగురి అరెస్ట్

నకిలీ బంగారం పెట్టి తూకంలో మోసం చేసిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణంలోని ముత్తూట్ మినీ ఫైనాన్స్ మేనేజర్‌గా గుండె రాజు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న సురేశ్, ఆకాశ్‌లతో కలిసి నకిలీ బంగారంతో చేసి రూ.7,20,356 నగదును సంస్థ నుంచి తీసుకుని బ్యాంకును మోసం చేసి తప్పించుకున్నాడు. రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.