News January 10, 2025
అంబటి అతని సోదరులపై కేసు

అంబటి, అతని సోదరుడు మురళీకృష్ణ మరికొందరిపై జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిల్లి బాబురావు ఫిర్యాదుతో గురువారం అట్రాసిటీ కేసు నమోదైంది. బాబు రావు కథనం.. భజరంగ్ జూట్ మిల్ వ్యవహారంలో డైరెక్టర్ దావ్ గోపాల్‌తో అక్రమ సేల్ డీడ్‌ను రద్దు చేయాలని 2022 HCలో కేసు వేశారు. కేసు వెనక్కి తీసుకోవాలని బాబూరావును బెదిరించారు. దీనిపై గత నవంబరు 15న HCలో పిటిషన్ వేయగా..వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
Similar News
News April 16, 2026
పెదనందిపాడు: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

పరీక్షల భయంతో పెదనందిపాడు మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చిలకలూరిపేటలో చదువుతున్న ఆమె.. ఫస్ట్ ఇయర్‌లో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయింది. ఈసారి కూడా ఫెయిల్ అవుతాననే భయంతో ఎలుకల మందు తాగింది. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. దీనిపై పెదనందిపాడు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
News April 16, 2026
సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళ్తారు. 11.45 గంటలకు ఆర్ధిక శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం సాయంత్రం 04.00 గంటలకు దేవాదాయ శాఖపై సమీక్షిస్తారు. తిరిగి 05.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
News April 15, 2026
టీడీపీ రాష్ట్ర కమిటీలో గుంటూరు నేతలకు ప్రాధాన్యం

టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ కమిటీల్లో గుంటూరు జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. గుంటూరు పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవిని పొలిట్ బ్యూరోగా నియమించారు. తెనాలి శ్రవణ్ కుమార్, భాష్యం రామకృష్ణ, కల్పటపు బుచ్చి రాంప్రసాద్, వీఆర్ శ్రీలక్ష్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇచ్చారు. దాసరి ఉదయశ్రీ యాదవ్, తాడిశెట్టి మురళి సహా పలువురికి రాష్ట్ర స్థాయి కమిటీల్లో చోటు కల్పించారు.


