News March 29, 2025
అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్పై కేసు నమోదు

అంబర్ పేట పీఎస్లో యూట్యూబర్ శంకర్పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.
Similar News
News September 18, 2025
HYD: ఆచార్య ఎస్వీ రామారావు నిర్యాణం పట్ల తెలుగు వర్సిటీ సంతాపం

తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టి పరిశోధన చేసిన గొప్ప సాహితీ వేత్త సూగూరు వేంకటరామారావు అని, వారి నిర్యాణం పట్ల తెలుగు విశ్వవిద్యాలయం ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. OU తెలుగు శాఖ పూర్వాచార్యులుగా, కేంద్రీయ విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, బెనారస్, బెంగళూరు విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారని, ఎస్వీ రామారావు మృతిపట్ల వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.
News September 18, 2025
VKB: క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి: VC

తెలుగు వర్శిటీలోని బాచుపల్లి ప్రాంగణంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో పలు విభాగాలలో అధ్యాపకులకు అధ్యాపకేతురులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్యఅతిథిగా ఉపకులపతి(VC) ఆచార్య నిత్యానందరావు హాజరై ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తిని చాటడం ద్వారా భావోద్వేగాలని ఎలా నియంత్రించుకోవాలో తెలుస్తుందన్నారు. స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్, వర్శిటీ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News September 17, 2025
16 ఏళ్ల నాటి పోరాటం గుర్తుచేసుకున్న MLC కవిత

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో, 2009లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన తెలంగాణ విలీన దినోత్సవం వేడుకల జ్ఞాపకాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ‘X’ ఖాతాలో పంచుకున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉన్న రోజులవి. ఆనాటి పోరాట స్ఫూర్తిని, యువతలో ఉన్న ఉత్సాహాన్ని మరోసారి ఆమె గుర్తుచేశారు.