News March 29, 2025

అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

అంబర్ పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.

Similar News

News April 25, 2025

యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News April 25, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 25, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.38 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.54 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.35 గంటలకు
✒ ఇష: రాత్రి 7.50 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 25, 2025

సంగారెడ్డి: వెబ్ సైట్‌లో ప్రవేట్ ఆసుపత్రుల వివరాలు: DMHO

image

జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్, డెంటల్ క్లినిక్ వివరాలను కలెక్టర్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి గురువారం తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్- 2010 ప్రకారం వీటిని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు. ప్రైవేట్ వైద్య సంస్థలపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా ఆధారాలతో జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

error: Content is protected !!