News March 29, 2025
అంబర్ పేట్: యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

అంబర్ పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది.
Similar News
News December 2, 2025
RR: ‘రెండో విడత నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి’

గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు అన్ని విధాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా అధికారిని నడుచుకోవాలని ఆదేశించారు.
News November 30, 2025
రంగారెడ్డి: మొదటి రోజు 450 నామినేషన్లు

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు కందుకూరు, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 450 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో 178 పంచాయతీ స్థానాలకు 152 నామినేషన్ దాఖలు కాగా 1540 వార్డు స్థానాలకు 298 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
News November 30, 2025
HYD: సీఎం పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన కవిత

సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నుంచి 9 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. “ఎన్నికలు గ్రామాల్లో ఉంటే, సీఎం జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారట. ప్రజలను ప్రభుత్వ సొమ్ముతో తరలించడం ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమే. ఎన్నికల కమిషన్ సీఎం పర్యటనను నిలిపివేయాలి” అని డిమాండ్ చేశారు.


