News February 9, 2025

అంబాజీపేటలో తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

image

అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన పమ్మి వెంకటేశ్శరరావు గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యానికి గురైయ్యారు. కూతురు పద్మ అన్నీ తానై తండ్రికి ఎన్నో సపర్యలు చేసింది. ఆదివారం పరిస్థితి విషమించడంతో వెంకటేశ్వరరావు తుది శ్వాస విడిచారు. కొడుకు స్థానంలో తలకొరివి పెట్టింది. గతంలో తన తల్లికి ఆరోగ్యం సరిగా లేని సమయంలో కూడా తల్లికి అన్ని కార్యక్రమాలు కూతురే నిర్వహించిందని బంధువులు తెలిపారు. 

Similar News

News October 28, 2025

మంచిర్యాల: అంగన్‌వాడీ కేంద్రాలు సాగేదెలా..?

image

మంచిర్యాల జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా వాటిని ఉన్నతాధికారులు ఇంతవరకు భర్తీ చేయడం లేదు. ముఖ్యంగా ఖాళీ ఏర్పడిన కేంద్రాల్లో టీచర్లకు బీఎల్ఓ వంటి ఇతర బాధ్యతలు అప్పజెప్పడంతో తమపై అదనపు భారం పడుతుందని టీచర్లు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా దీనిపై స్పందించి ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులని వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు.

News October 28, 2025

తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

image

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

News October 28, 2025

సూర్యాపేట: ప్రజలకు సుపరిపాలన అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సరైన రీతిలో ప్రజలకు చేరే విధంగా అధికారులు పారదర్శకతతో, బాధ్యతగా విధులు నిర్వహించి అర్హులైన వారిని మాత్రమే గుర్తించాలన్నారు.