News February 9, 2025
అంబాజీపేటలో తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన పమ్మి వెంకటేశ్శరరావు గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యానికి గురైయ్యారు. కూతురు పద్మ అన్నీ తానై తండ్రికి ఎన్నో సపర్యలు చేసింది. ఆదివారం పరిస్థితి విషమించడంతో వెంకటేశ్వరరావు తుది శ్వాస విడిచారు. కొడుకు స్థానంలో తలకొరివి పెట్టింది. గతంలో తన తల్లికి ఆరోగ్యం సరిగా లేని సమయంలో కూడా తల్లికి అన్ని కార్యక్రమాలు కూతురే నిర్వహించిందని బంధువులు తెలిపారు.
Similar News
News March 15, 2025
అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 195మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో శనివారం ద్వితీయ ఇంటర్ జనరల్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ పరీక్షలకు మొత్తం 4,170మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4050మంది రాసారని, 116ఆబ్సెంట్ అయ్యారని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. 8కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలకు 884మందికి గాను 805మంది హాజరు అయ్యారని, 79మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.
News March 15, 2025
చిన్న సినిమా.. తొలిరోజే భారీ కలెక్షన్లు

చిన్న సినిమాగా విడుదలైన ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ప్రీమియర్స్, తొలి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇందులో షేర్ దాదాపు రూ.4.5 కోట్ల వరకు ఉంటుంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.7 కోట్లు కాగా ఫస్ట్ డేనే సగానికి పైగా రికవరీ చేయడం విశేషం. మరి మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
News March 15, 2025
నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.