News March 24, 2025
అంబాజీపేట: గుర్తుతెలియని వాహనం ఢీ.. మహిళ మృతి

అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామ పరిధిలోని చినలంకలో గుర్తుతెలియని వాహనం ఢీకొని సోమవారం ఉదయం మతి భ్రమించిన మహిళ మృతి చెందింది. ఆమె వయసు 35 ఏళ్లు ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగి ఉంటుందని చెబుతున్నారు. ప్రధాన రోడ్డుపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అంబాజీపేట పోలీసులకు సమాచారం అందించారు. నాలుగు రోజుల నుంచి అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో ఆమె సంచరించిందని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
DEC తొలి వారంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు!

AP: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి DEC తొలి వారంలో నియామక పత్రాలు అందజేసి, శిక్షణకు పంపిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చినట్లు MLC వేపాడ చిరంజీవి తెలిపారు. ఇదే విషయమై ఆమెకు లేఖ రాయగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఈ ఏడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి AUGలో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు నిరాశతో ఉన్నారు.
News November 24, 2025
WGL: ఇప్పటి వరకు 556 మాత్రమే!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,442 దివ్యాంగ SHG ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో ఇప్పటి వరకు 556 మాత్రమే ఏర్పాటయ్యాయి. హనుమకొండలో 345లో 210, వరంగల్ 272లో 56, జనగామ 283లో 68, మహబూబాబాద్ 332లో 145, ములుగు 112లో 52, భూపాలపల్లి 98లో 25 సంఘాలు ఏర్పాటయ్యాయి. మరిన్ని సంఘాల ఏర్పాటుకు క్షేత్రస్థాయి సిబ్బంది దివ్యాంగులను అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నారు.
News November 24, 2025
HYD సిటీ కంటే ‘సింగారం’ బెస్ట్

పట్నంలో ఇరుకు రహదారులు, ట్రాఫిక్తో ప్రజలు విసిగిపోతున్నారు. విశాల ప్రాంతమైన సిటీ శివారు ప్రతాపసింగారానికి షిఫ్ట్ అవుతున్నారు. పట్నానికి 10 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇక్కడ ఇళ్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ఫోసిస్-ORR సమీపం కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్రయాణ సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీం కింద 130 ఎకరాలను సేకరించి అభివృద్ధి చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది.


