News March 26, 2025
అంబాజీపేట: బంగారు మురుగు సినిమా షూటింగ్

బంగారు మురుగు చిత్రం షూటింగ్ అంబాజీపేటలో మంగళవారం జరిగింది. డొక్కా ఫణి దర్శకత్వంలో పల్లెటూరి వాతావరణంలో ఈ చిత్రం షూటింగ్ నిర్వహిస్తున్నారు. నాయనమ్మ- మనవడు మధ్య జరిగే ఉమ్మడి కుటుంబం, పిల్లల పెంపకం, బంధుత్వాలు ఈ చిత్రంలో ప్రధానాంశాలుగా ఉంటాయని దర్శకులు తెలిపారు. ఏప్రిల్ 14 వరకు షూటింగ్ జరుగుతుందన్నారు. మాచవరం కోటి వారి అగ్రహారంలో మేడిది సత్తిరాజు వ్యవసాయ క్షేత్రంలో పలు దృశ్యాలను చిత్రీకరించారు.
Similar News
News October 25, 2025
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

<
News October 25, 2025
KNR: పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని, కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో “GIVE BLOOD – SAVE LIFE” నినాదంతో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పీటీసీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కళాశాల అధికారులను సీపీ అభినందించారు.
News October 25, 2025
అమరవీరుల త్యాగాలు వృథా కావు: ఎస్పీ

పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ వృథా కావని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసులు శాంతి భద్రతలకే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా ఎల్లప్పుడూ ముందుంటారని ఎస్పీ తెలిపారు. అమరుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.


